గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు లాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించు కునేందుకు, తీర ప్రాంత కోత నివారణ చర్యల్లో భాగంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుని ముందుకు తీసుకు వెళ్తున్నాం అని చెప్పారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్‌. ఇప్పటికే మూడు జోన్లుగా విభజించి 450 కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరగా, మిస్టీ నుంచి నిధులు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు.

భావితరాల భవిత కోసం పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సమన్యయంతో ముందుకు వెళ్తాం అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గోదావరి కాలుష్య నివారణ అంశంపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సహకారం కూడా కోరనున్నాం అన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి , తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ , లింగమనేని రమేష్ , శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే , పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి…

    ఏపీలో కురియ‌నున్న భారీ వ‌ర్షాలు

    Spread the love

    Spread the loveఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అమ‌రావ‌తి : నైరుతి రుతు ప‌వ‌నాలు ప్రారంభం అయ్యాయ‌ని, దీంతో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చ‌రించింది ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఐఎండీ). రాగల మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *