హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్ర‌విడ్

గౌత‌మ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్ప‌టికే బాధ్య‌త‌లు నిర్వ‌హించిన క‌ర్ణాట‌క‌కు చెందిన రాహుల్ ద్ర‌విడ్ తిరిగి ఇండియా జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ గా రానున్నాడా. అవున‌నే అంటున్నాయి క్రికెట్ వ‌ర్గాలు. ఇదిలా ఉండ‌గా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‌ను తొలగించి, ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను తిరిగి తీసుకు రావడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్ర‌స్తుతం నివేదిక‌ల‌ ప్రకారం బీసీసీఐ ఉన్నతాధికారులు, భాగస్వాములందరి మధ్య అంతర్గత ఓటింగ్ నిర్వహించగా, అత్యధిక ఓట్లు రాహుల్ ద్రవిడ్‌కు అనుకూలంగా వచ్చిన‌ట్లు స‌మాచారం.

డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఒక చిన్న ఓటింగ్ నిర్వహించగా, దాదాపు ఆటగాళ్లందరూ గౌతమ్ గంభీర్‌ను తొలగించడానికే ఓటు వేసిన‌ట్లు టాక్. గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా అన్ని అంశాలు ఉన్నందున, అతడిని హెడ్ కోచ్‌గా కొనసాగించడం జట్టు వాతావరణాన్ని దెబ్బ తీయవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియాలోకి తిరిగి రావాలని బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను సంప్రదించిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Related Posts

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    ఏపీని క్రీడా హ‌బ్ గా మార్చేందుకు స‌హ‌క‌రించండి

    అమ‌రావ‌తి : ఏపీని క్రీడా కేంద్రంగా మార్చేందుకు జై షా మద్దతు కోరారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి క్రీడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *