వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ కోసం సీనియ‌ర్ల‌పై ఫోక‌స్

Spread the love

కీల‌క స‌మావేశంలో ప‌లువురి ప్లేయ‌ర్ల పై చ‌ర్చ

ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌చ్చే ఏడాది 2027లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తోంది. ఇందులో బాగంగా దుబాయ్ వేదిక‌గా కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఆయా దేశాల‌కు సంబంధించిన క్రికెట్ బోర్డుల‌కు సమాచారం పంపించింది. ఇందులో భాగంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది ముంబై లో. ఈ సంద‌ర్బంగా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ప‌లువురు సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని అనుకుంటోంద‌ని స‌మాచారం. ఈమీటింగ్ లో సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్న‌ట్లు టాక్.

ఇదిలా ఉండ‌గా తాజాగా ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చేయ‌నుంది బీసీసీఐ.
కోలుకుంటున్న విరాట్ కోహ్లీ త్వరలోనే జట్టులోకి తిరిగి రానున్నాడు. భారత్ కీలక ఆటగాడు (MVP) హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి పునరాగమనానికి సిద్ధమయ్యాడు. ఒత్తిడిలో ఉన్న రోహిత్ శర్మకు ఇది ఒక చివరి అవకాశం కావచ్చని క్రికెట్ వ‌ర్గాల‌లో టాక్. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ తో పాటు సుదీర్ఘ విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా వన్డే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది . ఇంగ్లాండ్ పరిస్థితులకు అనుగుణంగా మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కవచ్చు.

  • Related Posts

    హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్ర‌విడ్

    Spread the love

    Spread the loveగౌత‌మ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్ప‌టికే బాధ్య‌త‌లు నిర్వ‌హించిన క‌ర్ణాట‌క‌కు చెందిన రాహుల్ ద్ర‌విడ్ తిరిగి ఇండియా జ‌ట్టుకు…

    మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveవివిధ ఫార్మాట్లలో గిల్ లేక పోవడంపై ఫైర్ హైద‌రాబాద్ : భారత మాజీ కెప్టెన్ , రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వివిధ ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ లేక పోవడంపై, అలాగే టెస్ట్ జట్టులో సర్ఫరాజ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *