హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్ర‌విడ్

Spread the love

గౌత‌మ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్

ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్ప‌టికే బాధ్య‌త‌లు నిర్వ‌హించిన క‌ర్ణాట‌క‌కు చెందిన రాహుల్ ద్ర‌విడ్ తిరిగి ఇండియా జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ గా రానున్నాడా. అవున‌నే అంటున్నాయి క్రికెట్ వ‌ర్గాలు. ఇదిలా ఉండ‌గా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‌ను తొలగించి, ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను తిరిగి తీసుకు రావడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్ర‌స్తుతం నివేదిక‌ల‌ ప్రకారం బీసీసీఐ ఉన్నతాధికారులు, భాగస్వాములందరి మధ్య అంతర్గత ఓటింగ్ నిర్వహించగా, అత్యధిక ఓట్లు రాహుల్ ద్రవిడ్‌కు అనుకూలంగా వచ్చిన‌ట్లు స‌మాచారం.

డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఒక చిన్న ఓటింగ్ నిర్వహించగా, దాదాపు ఆటగాళ్లందరూ గౌతమ్ గంభీర్‌ను తొలగించడానికే ఓటు వేసిన‌ట్లు టాక్. గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా అన్ని అంశాలు ఉన్నందున, అతడిని హెడ్ కోచ్‌గా కొనసాగించడం జట్టు వాతావరణాన్ని దెబ్బ తీయవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియాలోకి తిరిగి రావాలని బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను సంప్రదించిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Related Posts

    మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveవివిధ ఫార్మాట్లలో గిల్ లేక పోవడంపై ఫైర్ హైద‌రాబాద్ : భారత మాజీ కెప్టెన్ , రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వివిధ ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ లేక పోవడంపై, అలాగే టెస్ట్ జట్టులో సర్ఫరాజ్…

    వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఇండియా టాప్

    Spread the love

    Spread the loveఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దుబాయ్ : వ‌న్డే క్రికెట్ ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). భార‌త జ‌ట్టు టాప్ లో కొన‌సాగుతోంది . టాప్ 10 స్థానాల్లో జరిగిన ఏకైక మార్పు ఏమిటంటే,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *