శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం డీకే శివ‌కుమార్

Spread the love

త‌న‌తో పాటు కుటుంబం కూడా స్వామి ద‌ర్శ‌నం

తిరుమ‌ల : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు. త‌న సార‌థ్యంలోనే పార్టీ రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇంకా రెండేళ్ల పాటు ఆయన సీఎంగా ఉంటారు రాష్ట్రానికి. త‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో ఏదో ఒక రోజు ముఖ్య‌మంత్రి కావాల‌న్న‌ది త‌న క‌ల ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. డీకే శివ‌కుమార్ తో పాటు త‌న భార్య‌, కూతురు, కుటుంబీకులకు తిరుమ‌ల‌లో కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అంటే వ‌ల్ల‌మాలిన భ‌క్తి, అభిమానం కూడా. ఇటీవ‌లే తాను ముఖ్య‌మంత్రి పీఠంపై ఆశీసుల‌య్యారు.

ఈ సంద‌ర్బంగా స్వామి వారిని శుక్ర‌వారం ద‌ర్శించుకున్నారు త‌న స‌తీమ‌ణి, కుటుంబంతో క‌లిసి. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కాలు మోపిన తన‌కు ప్రోటోకాల్ ప్ర‌కారం ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించారు. ఆచార్యులు, పురోహితులు, పూజారులు, ఆల‌య అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా డీకే శివ‌కుమార్ మీడియాతో మాట్లాడారు. నా అర్ధాంగితో కలిసి తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గర్భాలయాన్ని సందర్శించి, స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నాను. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశాను . జగదుద్ధారకుడైన శ్రీనివాసుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించిన‌ట్లు తెలిపారు సీఎం డీకే శివ‌కుమార్.

  • Related Posts

    వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం

    Spread the love

    Spread the loveప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్…

    శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ఆర్జిత సేవలు రద్దు

    Spread the love

    Spread the loveజూన్ 25 నుంచి తెప్పోత్స‌వాల కార‌ణంగా తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వ‌ర‌కు తిరుప‌తి లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *