తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌకర్యాల‌పై చైర్మ‌న్ ఆరా

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు పోటెత్తారు

తిరుమ‌ల : తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు.

ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ముత్యపు పందిరి వాహనంలో భాగంగా ఆలయ నాలుగు మాడ వీధులలో పలు గ్యాలరీలలోని భక్తులతో ఛైర్మెన్ , ఈవో మాట్లాడారు. శ్రీవారి దర్శనం, అన్న ప్రసాదాలు, వసతి, రవాణా, కాలి నడకన వచ్చే భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై భక్తులతో మాట్లాడారు. అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని, టిటిడి అందిస్తున్న సేవలపై వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి వారి సూచనల మేరకు సౌకర్యాలు అందిస్తామన్నారు. పలువురు శ్రీవారి సేవకులు, డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులు, సిబ్బందితో ఈవో సింఘాల్ మాట్లాడారు. 28వ తేదీ గరుడ సేవ నేపథ్యంలో మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాలరీలలో భక్తులు, పలు కళా బృందాలు టిటిడి ఛైర్మెన్, ఈవోలతో ఫోటోలు దిగారు. ఉత్స‌వాలు వ‌చ్చే అక్టోబ‌ర్ నెల 2వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

  • Related Posts

    తిరుమ‌ల త‌ర‌హాలో శ్రీ‌శైలం ఆల‌య అభివృద్ధి

    త‌యారు చేయాల‌ని ఆదేశించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం త‌ర‌హాలో శ్రీ‌శైల భ్ర‌మ‌రాంభికా మ‌ల్లికార్జున స్వామి ఆల‌యాన్ని అభివృద్ది చేయాల‌ని ఆదేశించారు. ఆదివారం స‌చివాల‌యంలో సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాస్ట‌ర్ ప్లాన్ త‌యారు…

    కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

    పెద్ద ఎత్తున హాజ‌రైన శ్రీ‌వారి భ‌క్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *