సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మోయిత్రా

న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో కీల‌క అంశాల గురించి స్పందించారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీఎంసీ చీలి పోయింది. ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉంది మాజీ సీఎం, పార్టీ వ్య‌వ‌స్థాప‌కురాలు మ‌మ‌తా బెన‌ర్జీ. ప‌లువురు త‌ను తీసుకు వ‌చ్చి టికెట్లు ఇచ్చి గెలిపించిన వారంతా ప‌క్క‌దారి ప‌ట్టారు. వారంతా బేష‌ర‌తుగా, బ‌హిరంగంగానే బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. దీని వెనుక మాస్ట‌ర్ మైండ్ కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడ‌నేది జ‌గ‌మెరిగిన బ‌హిరంగ ర‌హ‌స్యం.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌ను ప్ర‌స్తుతం దీదీని వ్య‌తిరేకించి సీఎంగా కొలువు తీరిన బీజేపీకి చెందిన సువేందు అధికారిపై ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న‌తో భావోద్వేగ బంధం ఉందని చెప‌ప్పారు. నాకు లోక్‌సభ సీటు నిరాకరించినప్పుడు రాత్రంతా ఏడ్చాను. సువేందు నాకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. నేను కరీంపూర్ నుండి పోటీ చేసినప్పుడు, నా కోసం ఎవరూ ప్రచారం చేయలేదు. ఒక్కరూ కాదు. కేవలం సువేందు మాత్రమే వచ్చి నా కోసం ప్రచారం చేశార‌ని కితాబు ఇచ్చారు. మేమిద్దరం కలిసి పార్టీలో ఉన్నప్పుడు, ఆయన నాకు చాలా మద్దతు ఇచ్చార‌ని పేర్కొన్నారు ఎంపీ.

  • Related Posts

    ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి

    Spread the love

    Spread the loveనియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్…

    ఎమ‌ర్జెన్సీ చారిత్ర‌క సంఘ‌ట‌న కాదు

    Spread the love

    Spread the loveఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : శివ‌సేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంద‌లో భాగంగా 9వ త‌ర‌గ‌తి సాంఘిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *