రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

Spread the love

14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్బంగా కోర్టు న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. కృష్ణలంక పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ ఉన్నాడు. తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ సిట్. ఈఘ‌ట‌న అనంత‌రం సీఐ నాగ‌రాజు ప‌రార‌య్యాడు. ఈ స‌మ‌యంలో మే 6న సాయికృష్ణను మార్కాపురంలో పట్టుకుని కృష్ణలంక పీఎస్‌కు తీసుకువచ్చారు.

సాయికృష్ణ పోలీసు కస్టడీలో ఉన్న విషయాన్ని దాచి పెట్టారు. కావాలనే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది. ఇదిలా ఉండ‌గా సాయికృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారని ఆరోపించింది. కీలక CCTV ఫుటేజ్ డిలీట్ చేశారని బాంబు పేల్చింది. సీఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని కోర్టులో తెలిపింది. మరింత విచారణ కోసం సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.

  • Related Posts

    తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

    Spread the love

    Spread the loveపిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో…

    రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

    Spread the love

    Spread the loveకొత్త‌గా ఎన్నికైన 24 మంది స‌భ్యులు ఢిల్లీ : ఇటీవ‌ల పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ‌కు 24 మంది పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్య‌స‌భలో గెలుపొందిన వారు ప్ర‌మాణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *