ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి

నియ‌మించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై. శ్రీ‌లక్ష్మిని నియ‌మించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్ జారీ చేసింది ప్ర‌భుత్వం. గురువారం ఇందుకు సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఇక త‌న విష‌యానికి వ‌స్తే త‌న పూర్తి పేరు యెర్ర శ్రీలక్ష్మి. 1988 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వ్య‌క్తి.

మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ లో ప‌ని చేశారు. కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించ బ‌డ్డారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరారు. పరిశ్రమలు, గనులు, మున్సిపల్ పరిపాలన తదితర శాఖల్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. 2011లో ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC)కు సంబంధించిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. గనుల లీజుల మంజూరులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆమెపై విచారణలు, న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగాయి.

2020లో ఆమె ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోకి బదిలీ అయ్యారు. 2022లో ఒక దశలో ఆమెకు ఉపశమనం లభించినప్పటికీ, కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు తరువాత కూడా కోర్టుల్లో కొనసాగాయి.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *