బేరి రామచందర్ యాదవ్ డిమాండ్
హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ కి బీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సమక్షంలో ఓబీసీ సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. మియాపూర్ ఓబీసీ మోర్చా సమావేశం మదీనగూడ భూమి బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నందున 54 శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని, పేద వర్గాలైన 132 బీసీ కులాలకు అన్ని విధాల సహాయ పడాలని కోరారు.
బీసీ కులాల్లో ఎక్కువగా పేదలు ఉన్నారని వారికి విద్య, వైద్యం అందించేందుకు కృషి చేయాలని విన్నవించారు. ముద్ర లోన్లు, సబ్సిడీ లోన్స్ మిగతా అన్ని సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అన్ని బీసీ కుల సంఘాలకు వర్తించే విధంగా వృత్తి ధర్మంగా 132 కులాలకు సహాయం చేయాలని కోరారు రైతుల్లో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. బ్యాంకు లోన్లు ఇవ్వక పోవడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని పేర్కొన్నారు. సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని అన్నారు.





