వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై బీజేపీ ఫైర్

ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం

చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు. శ‌నివారం త‌ను మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) వ్యవస్థాపకుడైన వెంకట నారాయణ, రాజకీయాల్లోకి రాకముందు సి. జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ను నిర్మించారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది పూర్తిగా చ‌ట్టానికి విరుద్దంగా జ‌రిగింద‌ని పేర్కొన్నారు. తక్ష‌ణ‌మే వెంక‌ట నారాయ‌ణ నియామ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని వైనార్ నాగేంద్రన్ డిమాండ్ చేశారు. త‌మిళనాడుకు చెందిన వారు అనుభ‌వం క‌లిగిన ఆఫీస‌ర్లు లేరా అని ప్ర‌శ్నించారు బీజేపీ అధ్య‌క్షుడు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల అస్తిత్వానికి భంగం క‌లిగించేలా సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఆవేద‌న చెందారు.

  • Related Posts

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    ఆరోగ్యంపై చైతన్యం పెరగాలి : సీతక్క

    హైద‌రాబాద్ : సంపాదించ‌డం కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాల‌ని అన్నారు మంత్రి సీత‌క్క‌. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన పింక్ ర‌న్ ను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడతాయని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *