శాస్త్రోక్తంగా అక్షర గోవిందం అన్నప్రాశనం

తిరుపతి : చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మంగళ ప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన “అక్షర గోవిందం – అన్నప్రాశనం” కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర పాల్గొని చిన్నారులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ అక్షరాభ్యాసం, అన్న ప్రాశనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలు అని పేర్కొన్నారు. తొలి అక్షరం “గోవింద” నామంతో ప్రారంభమైతే విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు. ప్రతి హిందూ కుటుంబం ఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులకు ‘అక్షర గోవిందం కిట్’ ఉచితంగా అందజేశారు. ఇందులో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ వకుళామాత, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్షతో పాటు పూజా, విద్యా సామగ్రి ఉన్నాయి. అనంతరం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన యాత్రికుల వసతి సముదాయాన్ని టీటీడీ చైర్మన్, ఈవో సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, దర్శన్, ఎన్ సదాశివరావు, డాలర్ దివాకర్ రెడ్డి, హెచ్‌డీపీపీ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్, అదనపు కార్యదర్శి కల్యాణి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *