
ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా
ముంబై : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా ఎవరూ ఊహించని రీతిలో మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన ఒకప్పటి ఢిల్లీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ కార్యాలయంలో ఈ నిర్ణయాన్ని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటించారు. కెరీర్ పరంగా మన్హాస్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా ఉన్నారు.
తను లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 27 సెంచరీలతో 9714 ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించాడు, వీటిలో 4126 పరుగులు ఉన్నాయి. ఢిల్లీ మాజీ కెప్టెన్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బీసీసీఐ చీఫ్ గా ఉన్న కర్ణాటకకు చెందిన టాప్ ప్లేయర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందంటూ తను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు రాజీనామా సమర్పించారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా ప్రెసిడెంట్ గా నేటి వరకు పని చేశాడు. ఇవాళ ఏకగ్రీవంగా మన్హాస్ ను ఎన్నుకున్నారు.
తను బీసీసీఐకి 37వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తన ఎన్నిక క్రికెట్ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఎవరూ ఊహించ లేదు తను చీఫ్ గా ఉంటాడని. తన స్వస్థలం జమ్మూ కాశ్మీర్. ఇదే ప్రాంతానికి చెందిన డాక్టర్ జితేందర్ సింగ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ సందర్బంగా మిథున్ మన్హాస్ ను అభినందించారు.