భాగ్య‌న‌గ‌రం పింక్ మ‌యం : సుధారెడ్డి

ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేష‌న్

హైద‌రాబాద్ : బ్రెస్ట్ క్యాన్స‌ర్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేష‌న్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదిక‌గా పింక్ ప‌వ‌ర్ ర‌న్ నిర్వహించారు. ఈ పరుగు ఒక ప్రవాహంలా హుస్సేన్ సాగర్ పక్కనే సాగింది. పది కిలోమీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ముగ్గురు మహిళలు, పురుషులకు ట్రోపీలతో పాటు ప్రైజ్ మనీ అందించారు. అదే విధంగా ఐదు కిలోమీటర్ల పరుగును పూర్తి చేసిన వారికి కూడా ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందించారు. బ్రెస్ట్ కాన్సర్ అవేర్నెస్ పరుగులో పది కిలోమీటర్ల విభాగంలో పాల్గొన్న ఏడు సంవత్సరాల పార్వతి, ఐదు కిలోమీటర్ల విభాగంలో పాల్గొన్న ఐదు సంవత్సరాల కబీర్ సింగ్, వీల్ చైర్ తో పాల్గొన్న నంద కిషోర్ అనే యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. పరుగు ప్రారంభం సందర్భంగా పాల్గొన్న వారిని ఉత్సాహ పరిచేందుకు వారి పై నిర్వాహకులు పూల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్గించేందుకు ఎస్ ఆర్ ఫౌండేషన్, ఎం ఈ ఐ ఎల్ ఫౌండేషన్ పరుగు నిర్వహించటం సంతోషకరం అన్నారు. పరుగులో పాల్గొన్న వారిని అభినందించారు. బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించు కోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి పురుషుడు తన కుటుంబంలోని మహిళలకు బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించటంతో పాటు పరీక్షలు చేయించాలని సూచించారు. ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స చేయించుకుంటే నయం అవుతుందన్నారు.

హైద్రాబాదు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మాట్లాడుతూ పరుగుల రాజధానిగా మారిన హైదరాబాద్ లో బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం వివిధ విభాగాల్లో మారథాన్ నిర్వహించటం సంతోషం అన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఆలోచించి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలన్నారు. బ్రెస్ట్ కాన్సర్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో భయాందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో దానిపై అవగాహనకు మారథాన్ నిర్వహిస్తున్న సుధారెడ్డి అభినందనీయురాలు అన్నారు. ప్రతి ఒక్కరు కాన్సర్ పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేయించుకోవటం వల్ల లాభం కలుగుతుందన్నారు.

సీనియర్ ఐ పీ ఎస్ అధికారి తరుణ్ జోషి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యం పట్ల అవగాహన ముఖ్యం అన్నారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ మాట్లాడుతూ కాన్సర్ మహమ్మారి పై అవగాహన కల్పించేందుకు రన్ నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది పది వేల మంది, ఈ ఏడాది 20 వేల మంది పింక్ పవర్ రన్ లో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఈ పరుగు ప్రతి ఒక్కరి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలిపారు.

సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇటువంటి రన్ లు ఉపయోగ పడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

  • Related Posts

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *