
5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు
దుబాయ్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తమకు ఎదురే లేదని చాటింది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ను కైవసం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. 5 వికెట్ల తేడాతో కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారత జట్టుపై అవాకులు చెవాకులు పేలుతూ వచ్చిన పాకిస్తాన్ కు చెంప చెల్లుమనించిపేలా చేసింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా టీమిండియా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలుపొందాడు. వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపించారు జట్టు ఆటగాళ్లు. పాకిస్తాన్ మైదానంలోకి దిగగానే దాడి ప్రారంభించింది. పవర్ ప్లే వరకు చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తి కాకుండానే చాప చుట్టేసింది. 146 పరుగులకే పరిమితమైంది.
అనంతరం దుబాయ్ స్టేడియం పూర్తిగా క్రిక్కిరిసి పోయింది. 147 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగింది. ఆసియా కప్ లో సత్తా చాటుతూ వచ్చిన యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఈసారి నిరాశ పరిచాడు. అంతే కాకుండా వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ ఆశించిన రాణించలేక పోయారు. ఈ తరుణంలో మైదానంలోకి వచ్చిన సంజూ శాంసన్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్ం చేశాడు. తిలక్ వర్మతో కలిసి 54 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే అద్భుతంగా రన్స్ చేశాడు. వర్మ చివరి వరకు ఉన్నాడు. తను 69 రన్స్ చేయగా శాంసన్ 24, దూబే 33 పరుగులు చేశారు. ఆఖరుకు రింకూ సింగ్ సూపర్ సిక్స్ కొట్టడంతో ఇండియా విక్టరీ నమోదు చేసింది.