‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్ర‌మే కాద‌ని, ఈ ప్రాంత ప్ర‌జ‌ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవం అని సీఎం చెప్పారు.

ఈ బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు మూడు వేలకు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలు, తెలంగాణ గంగా జమునా తెహ‌జీబ్ సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌మ‌ని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయని సీఎం వెల్ల‌డించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. భ‌క్తులు సంయ‌మం పాటించాల‌ని సూచించారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *