హైదరాబాద్ : ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ నోలన్ కీలక పాత్ర పోషించిన చిత్రం ది ఒడిస్సీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కోట్లాది ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ మూవీని భారీ ఎత్తున ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. తెలుగు, హిందీ, తమిళం, ఆంగ్ల భాషలలో విడుదలైన ‘ది ఒడిస్సీ’, భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా అధికారికంగా నిలిచింది. ప్రస్తుతం క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన ‘ది ఒడిస్సీ’ చిత్రం సోషల్ మీడియా వేదికలన్నింటిలోనూ ట్రెండ్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ పాటిన్సన్ వంటి ప్రముఖ తారాగణం నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది.
భారతదేశంలో అన్ని భాషలు కలిపి ‘ది ఒడిస్సీ’ తన తొలి రోజున సుమారు రూ. 17.40 కోట్ల నికర వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ ట్రాకర్ ‘Sacnilk’ ప్రకారం, దేశ వ్యాప్తంగా జరిగిన 8,413 షోల ద్వారా ఈ ఆకట్టుకునే తొలి రోజు వసూళ్లు నమోదయ్యాయి. ది ఒడిస్సీ’ తన కెరీర్‌లో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటని పేర్కొన్నారు టామ్ హాలండ్. ఈ చిత్రం గ్రాస్ వసూళ్లు రూ. 20.76 కోట్లుగా ఉన్నాయి . విడుదల రోజున థియేటర్లలో 45.7% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. తెలుగు, హిందీ, తమిళం , ఆంగ్ల భాషలలో విడుదలైన ‘ది ఒడిస్సీ’, భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో నిలవడం విశేషం. క్రిస్టోఫర్ నోలన్ రచన , దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చార్లిజ్ థెరాన్, లుపిటా న్యోంగో, జెండయా, జాన్ బెర్న్‌థాల్, హిమేష్ పటేల్, జాన్ లెగుయిజామో , మియా గోత్ వంటి అద్భుతమైన తారాగణం కూడా ఉంది.






