
అన్నదాతల గురించి మాట్లాడే అర్హత లేదు
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఆయన హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆ విషయం జనానికి తెలుసన్నారు. కానీ మరిచి పోయి లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఉల్లి, టమాటో రైతులకు పూర్తి భరోసా ఇచ్చామని చెప్పారు. ఇక డిమాండ్ ను మించి ఒకే సారి రైతులు పంటను మార్కెట్ కు తీసుకు రావడంతో మార్కెట్ వ్యత్యాసపు ధరను ప్రకటించామని అన్నారు. రూ. 1200 క్వింటాలుకు ఉంటే ఆ ధరకు తక్కువగా రైతులకు లభిస్తే మిగిలిన నగదును ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందన్నారు. 2016లో ఉల్లి ధరలు పడిపోతే 7723 మంది రైతుల నుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని చెప్పారు మంత్రి.
2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 కోట్లు చెల్లించామని తెలిపారు. 2025 సంవత్సరంలో ఈ నెల 15 వ తేదీ వరకు రైతు బజార్ల కోసం 9014 క్వింటా ఉల్లిని కొనుగోలు చేశామని వెల్లడించారు. మార్క్ ఫెడ్ ద్వారా 53239 క్వింటాలను సేకరించడం జరిగిందన్నారు. 15292 క్వింటాల ఉల్లిని నేరుగా కోనుగోలు చేశామన్నారు. ధర వ్యత్యాస పథకం కింద మార్క్ ఫెడ్, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా 51268 క్వింటాల ఉల్లిని కోనుగోలు చేశారని ఇప్పటి దాకా. మార్క్ ఫెడ్ ద్వారా 931 మంది రైతుల ద్వారా 5.97 కోట్ల ఉల్లిని కోనుగోలు చేసిందని, అందులో ధర వ్యత్యాసం కింద 752 మంది రైతులకు 4.25 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.