ఫాల్కే పుర‌స్కారం ప్ర‌తి ఒక్క‌రికి అంకితం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ లాల్

కేర‌ళ : కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారానికి ఎంపిక చేయ‌డం ప‌ట్ల స్పందించారు మ‌ల‌యాళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన దిగ్గ‌జ న‌టుడు మోహ‌న్ లాల్. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన ఉన్న‌తికి కార‌కులైన వాళ్లు, త‌న విజ‌యానికి దోహ‌ద ప‌డిన వాళ్లు, త‌న అడుగుల‌కు శ‌క్తిగా మారిన వాళ్ల‌కు, పేరు పేరునా ప్ర‌తి ఒక్క‌రికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని , ఈ అవార్డు త‌న‌కు ద‌క్కిన‌ది కాద‌ని వారంద‌రికీ చెందిన‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి కేంద్ర కార్యాల‌యం నుంచి త‌న‌కు ఫోన్ వ‌చ్చింద‌ని, మీరు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక‌య్యార‌ని తెలిపార‌ని చెప్పారు. కానీ దీనిని తాను న‌మ్మ‌లేక పోయాన‌ని తెలిపారు. ఆ త‌ర్వాత అది వాస్త‌వ‌మ‌ని తెలుసుకున్నాక ఆనందానికి గురైన‌ట్లు చెప్పారు మోహ‌న్ లాల్.

ఇది త‌న జీవితంలో మ‌రిచి పోలేని రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ప్ర‌తి క‌ళాకారుడికి ఓ క‌ల ఉంటుంద‌ని, అది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవాల‌ని. ఈ దేశ సినిమా రూపు దిద్దు కోవ‌డానికి ప్రాణం పోసిన మ‌హోన్న‌త మాన‌వుడు ఫాల్కే అని కొనియాడారు. ఇవాళ ఆయ‌న లేక పోయినా సినిమా విరాజిల్లు తోంద‌న్నారు. ఇది ఒక అద్భుత‌మైన ప‌రిశ్ర‌మ‌గా మారింద‌న్నారు మోహ‌న్ లాల్. ఒక ర‌కంగా ఆ దేవుడి ద‌య వ‌ల్ల త‌న‌కు ఈ పుర‌స్కారం ల‌భించింద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటుంది. నేను ఈ అవార్డును అందరితో పంచుకుంటాను. నేను విమర్శలను భుజాన వేసుకుని నడిచే వ్యక్తిని కాదు; ఈ క్షణం ఎంతో విలువైనది అని పేర్కొన్నారు. సినిమాల్లో 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోహన్ లాల్, పరిశ్రమలోని కొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం తన అదృష్టమని, వారి ఆశీస్సులు ఈ గౌరవం వెనుక ఉన్నాయని అన్నారు.

  • Related Posts

    ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    న‌టుడు రాహుల్ రామ‌క్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : న‌టుడు, ర‌చ‌యిత రాహుల్ రామ‌కృష్ణ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. త‌ను తాజాగా ఎక్స్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున…

    బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాత‌లు హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *