తెలంగాణ ఆత్మ గౌర‌వానికి బ‌తుక‌మ్మ ప్ర‌తీక‌

పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగ‌రిక‌త‌కే కాదు ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ అని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికి పేరు పేరునా బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పండుగ ప్రకృతితో మమేకమై పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఆయన అన్నారు. పూల బతుకమ్మను తీర్చిదిద్దడం, సామూహికంగా పాటలు పాడుతూ నృత్యం చేయడం తెలంగాణ మహిళల ఐక్యతకు, ఆనందానికి నిదర్శనమని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి మరింత గుర్తింపు వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాల పాటు ప్రతి ఆడబిడ్డకు అన్ని రకాలుగా అండగా ఉండేలా, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో వాళ్ళను సాగించామని కేటీఆర్ గుర్తు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీతో మహిళలకు ఆడబిడ్డలుగా పండగ పూట గౌరవ సూచకంగా అందించామని చెప్పారు.
ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలను, సౌభాగ్యాన్ని నింపాలని, ఆడబిడ్డలందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

  • Related Posts

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    ధీమా వ్య‌క్తం చేసిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్. క‌రీనంగ‌ర్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు.…

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *