తెలంగాణ ఆత్మ గౌర‌వానికి బ‌తుక‌మ్మ ప్ర‌తీక‌

Spread the love

పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగ‌రిక‌త‌కే కాదు ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ అని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికి పేరు పేరునా బ‌తుక‌మ్మ ఉత్స‌వాల‌లో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పండుగ ప్రకృతితో మమేకమై పర్యావరణ పరిరక్షణకు ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తుందని ఆయన అన్నారు. పూల బతుకమ్మను తీర్చిదిద్దడం, సామూహికంగా పాటలు పాడుతూ నృత్యం చేయడం తెలంగాణ మహిళల ఐక్యతకు, ఆనందానికి నిదర్శనమని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్.బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతికి మరింత గుర్తింపు వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పది సంవత్సరాల పాటు ప్రతి ఆడబిడ్డకు అన్ని రకాలుగా అండగా ఉండేలా, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో వాళ్ళను సాగించామని కేటీఆర్ గుర్తు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీతో మహిళలకు ఆడబిడ్డలుగా పండగ పూట గౌరవ సూచకంగా అందించామని చెప్పారు.
ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలను, సౌభాగ్యాన్ని నింపాలని, ఆడబిడ్డలందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

  • Related Posts

    అక్కా చెల్లెళ్ల‌తో ఆటాడుకుంటున్న చంద్ర‌బాబు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిగూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85…

    వెంక‌ట నారాయ‌ణ నియామ‌కంపై బీజేపీ ఫైర్

    Spread the love

    Spread the loveఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని ఆగ్ర‌హం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *