డొనాల్డ్ ట్రంప్ దెబ్బ టాలీవుడ్ అబ్బా

Spread the love

విదేశీ సినిమాల‌పై 100 సుంకాలు విధింపు

అమెరికా : అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ కొలువు తీరాక అన్ని రంగాలు విల విల లాడుతున్నాయి. ప్ర‌త్యేకించి సుంకాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్ప‌టికే వ‌స్తుల‌పై 50 శాతం సుంకం విధించిన ట్రంప్ ఉన్న‌ట్టుండి మ‌రో బాంబు పేల్చారు. ఇందులో భాగంగా ఆయ‌న క‌న్ను సినిమాల‌పై ప‌డింది. ప్ర‌ధానంగా ఈ ఎఫెక్టు ఎక్కువ‌గా భార‌త దేశానికి చందిన సినిమాల‌పై ప‌డ‌నుంది. ఏకంగా విదేశీ సినిమాలు ప్ర‌ద‌ర్శించాలంటే 100 శాతం సుంకం క‌ట్టాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు దేశాధ్య‌క్షుడు ట్రంప్.
దీంతో ల‌బోదిబోమంటున్నారు సినీ రంగానికి చెందిన నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, న‌టీ న‌టులు. ఈ ఎఫెక్టు ఎక్కువ‌గా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల‌పై ప‌డ‌నుంది.

ఇతర దేశాలు అమెరికా నుండి చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని దొంగిలించాయని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి ఇతర దేశాలు ‘శిశువు నుండి మిఠాయి’ని దొంగిలించినట్లే దొంగిలించాయంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధానంగా కాలిఫోర్నియాతీవ్రంగా దెబ్బతిందంటూ వాపోయారు. ఇందుకు గాను తాను యునైటెడ్ స్టేట్స్ వెలుపల నిర్మించే ఏదైనా స‌రే అన్ని సినిమాలపై 100 శాతం టారిఫ్ విధిస్తానంటూ ప్ర‌క‌టించారు. ఇది త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తుంద‌ని అన్నారు అమెరికా అధ్య‌క్షుడు.

  • Related Posts

    భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    Spread the love

    Spread the loveఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి…

    మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    Spread the love

    Spread the loveరూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *