
59 పరుగుల తేడాతో ఇండియా విన్
గౌహతి : అస్సాంలోని గౌహతి మైదానంలో ఘనంగా ప్రారంభమైంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళా వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవలే మృతి చెందిన అస్సాం భూమి పుత్రుడు, అమర గాయకుడు జుబీన్ గార్గ్ కు ఘనంగా నివాళులు అర్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). మెగా టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ భారత మహిళా జట్టు, శ్రీలంకతో తలపడింది. మ్యాచ్ కు కొంత వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. తొలుత టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. ఆదిలోనే స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన పెవిలియన్ బాట పట్టింది. ఇదే సమయంలో శ్రీలంక బౌలర్లు కట్టడి చేశారు ప్లేయర్లను. 27 ఓవర్లలో 6 కీలకమైన వికెట్లను కోల్పోయి 126 రన్స్ చేసింది. ఈ తరుణంలో దీప్తి శర్మ, కౌర్ కలిసి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు.
ఈ ఇద్దరూ కలిసి 7వ వికెట్ కు 99 బంతులు ఎదుర్కొని 103 కీలకమైన పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. 47 ఓవర్లలో 269 పరుగులు చేసింది. అనంతరం 270 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగింది శ్రీలంక జట్టు. 45.4 ఓవర్లలో 211 రన్స్ కే పరిమతమైంది. దీప్తి శర్మ 53 రన్స్ చేసింది 3 వికెట్లు తీసింది. అమన్ కౌర్ 57 పరుగులు చేసింది. ఒక వికెట్ తీసింది. స్నేహ రాణా 32 రన్స్ ఇచ్చి 2 వికట్లు తీయగా శ్రీ చరణి 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. టోర్నమెంట్ లో భాగంగా భారత జట్టు రెండో మ్యాచ్ దాయాది పాకిస్తాన్ తో శ్రీలంకతో తలపడనుంది.