భారీ స్కోర్ దిశ‌గా టీమ్ ఇండియా

Spread the love

స‌త్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచ‌రీ

గుజ‌రాత్ : అహ్మ‌దాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్ర‌స్తుతం భారత్ లో టెస్టు సీరీస్ ఆడేందుకు ఇండియాలో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు ప్రారంభ‌మైంది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. 162 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అనంత‌రం మైదానంలోకి దిగింది భార‌త జ‌ట్టు లంచ్ టైం ముగిసే స‌మ‌యానికి టీమ్ ఇండియా 3 కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. 218 ప‌రుగులు చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా భార‌త జ‌ట్టుకు చెందిన స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ సూప‌ర్ షో చేశాడు.

ఆక‌ట్టుకునేలా ఆడాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. త‌ను సెంచ‌రీతో నాటౌట్ గా నిలిచాడు. ఇంకా ఆట ఆడేందుకు ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి. ప్ర‌స్తుతం శుక్ర‌వారం రెండో రోజు ఆట కొన‌సాగుతోంది. 2వ వికెట్ కు 121 ర‌న్స్ చేసింది. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు సార‌థి శుభ‌మ‌న్ గిల్ నాయ‌కుడిగా రాణించాడు. మ‌రోసారి స‌త్తా చాటాడు. 50 ర‌న్స్ చేశాడు సెంచ‌రీ దిశగా సాగుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి హాఫ్ సెంచ‌రీ వ‌ద్ద త‌న స్కోర్ ఆగి పోయింది. అయినా ఎక్క‌డా తొణ‌క‌లేదు కేఎల్ రాహుల్. ఇప్ప‌టికే త‌న ఆట తీరుతో దుమ్ము రేపుతూ వ‌స్తున్న స‌ద‌రు క్రికెట‌ర్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. రేపు రాబోయే 3 రోజుల్లో ఇండియా సూప‌ర్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *