పండుగ వేళ స‌మంత ఆనంద హేళ

Spread the love

రాజ్ నిడుమోరుతో జ‌త క‌ట్ట‌నుందా

ముంబై : ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భు మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. త‌ను అక్కినేని నాగ చైత‌న్య‌తో విడి పోయింది. ఆ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. కానీ సినిమాల‌లో, వెబ్ సీరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. అంతే కాకుండా ఫ్యాష‌న్ షూట్ లో పాల్గొంది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన విష‌యాల‌ను , ఫోటోల‌ను, వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో పంచుకుంటూ వ‌స్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పింది.
అయితే ఇన్‌స్టాగ్రామ్ తాజా పోస్ట్ రాజ్ నిడిమోరుతో కొత్త ప్రారంభం గురించి పుకార్లకు ఆజ్యం పోసింది. తన అభిమానులను ఆశ్చర్య పరిచేలా చేసింది. ఈసారి తాను కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన‌ట్లు తెలిపింది. త‌న పూజ గ‌ది చిత్రాల‌తో పాటు , గోడ‌పై క‌ళాత్మ‌క సామ్ లోగోను కూడా ప్ర‌త్యేకంగా షేర్ చేసింది.

అయితే న‌టి స‌మంత రుత్ ప్ర‌భు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ కలల ఇల్లు హైదరాబాద్‌లో ఉందా లేక‌ ముంబైలో ఉందా అనేది మాత్రం వెల్ల‌డించ లేదు. ఈ రహస్యం ఫిల్మ్ సర్కిల్‌లలో పుకార్ల‌కు ఆజ్యం పోసింది. ముఖ్యంగా రాజ్ , డికె ఫేమ్ చిత్రనిర్మాత రాజ్ నిడిమోరుతో ఆమెకు సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఈ ఇద్ద‌రు క‌లిసి తిరుమ‌ల‌ను ఇటీవ‌లే సంద‌ర్శించారు. కాగా ఇది కేవలం కొత్త ఇంటి గురించేనా లేక‌ ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయం ప్రారంభమా అనేది తేలాల్సి ఉంది. యే మాయ చేసావేతో తన కెరీర్‌ను ప్రారంభించి, బృందావనం, దూకుడు, ఈగ, రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించింది స‌మంత‌.

  • Related Posts

    భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్ కళ్యాణ్ సినిమా

    Spread the love

    Spread the loveఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ నెట్ ఫ్లిక్స్ స్వంతం హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌న‌తో డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మ‌రోసారి…

    మార్కెట్ మోసానికి గురైన డైరెక్ట‌ర్ కొడుకు

    Spread the love

    Spread the loveరూ. 63 ల‌క్ష‌లు కోల్పోయానంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : సైబ‌ర్ వ‌ల‌లో ప‌లువురు ప‌డ్డారు. కోట్లాది రూపాయ‌లు న‌ష్ట పోతున్నారు. క‌ష్ట‌ప‌డిన వారంతా అత్యాస‌కు గురై డ‌బ్బుల‌ను కోల్పోతున్నారు. నిన్న మాజీ సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ భార్య ఏకంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *