ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏపీ స‌ర్కార్ అండ : డిప్యూటీ సీఎం

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్య‌క్రమం

విజ‌య‌వాడ : అన్ని వ‌ర్గాల‌ను ఆదుకోవ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. విజ‌య‌వాడ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో అనే ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్బంగా ఆటో డ్రైవ‌ర్ల ఖాతాలో రూ. 15000 జ‌మ చేసింది. భారీ ఎత్తున ఆటో డ్రైవ‌ర్లకు ల‌బ్ది చేకూర‌నుంది. ఎన్నికల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు తాము అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప‌థ‌కం ప్రారంభ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆటోలో ప్ర‌యాణం చేశారు. తాను ఆటో ఛార్జీ చెల్లించారు. గ‌త స‌ర్కార్ అంద‌రినీ మోసం చేసింద‌ని ఆరోపించారు. కానీ కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక సీన్ మారింద‌న్నారు.

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 2 లక్షల 90 వేల మందికి పైగా ఆటో డ్రైవర్ సోదరులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వారికి ఊతం ఇవ్వడానికి సుమారు 436 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తున్న‌ద‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. గ్రీన్‌ ట్యాక్స్‌ భారంపై ప్రముఖంగా ప్రస్తావించారని, దానిని కూడా త‌గ్గించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌ధానంగా రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టామ‌ని చెప్పారు. సమర్థ నాయకత్వం, ప్రణాళికాబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందన్నారు.

  • Related Posts

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *