ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏపీ స‌ర్కార్ అండ : డిప్యూటీ సీఎం

Spread the love

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్య‌క్రమం

విజ‌య‌వాడ : అన్ని వ‌ర్గాల‌ను ఆదుకోవ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. విజ‌య‌వాడ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో అనే ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్బంగా ఆటో డ్రైవ‌ర్ల ఖాతాలో రూ. 15000 జ‌మ చేసింది. భారీ ఎత్తున ఆటో డ్రైవ‌ర్లకు ల‌బ్ది చేకూర‌నుంది. ఎన్నికల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు తాము అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప‌థ‌కం ప్రారంభ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆటోలో ప్ర‌యాణం చేశారు. తాను ఆటో ఛార్జీ చెల్లించారు. గ‌త స‌ర్కార్ అంద‌రినీ మోసం చేసింద‌ని ఆరోపించారు. కానీ కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక సీన్ మారింద‌న్నారు.

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 2 లక్షల 90 వేల మందికి పైగా ఆటో డ్రైవర్ సోదరులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వారికి ఊతం ఇవ్వడానికి సుమారు 436 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తున్న‌ద‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. గ్రీన్‌ ట్యాక్స్‌ భారంపై ప్రముఖంగా ప్రస్తావించారని, దానిని కూడా త‌గ్గించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌ధానంగా రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టామ‌ని చెప్పారు. సమర్థ నాయకత్వం, ప్రణాళికాబద్ధ పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందన్నారు.

  • Related Posts

    జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    Spread the love

    Spread the loveస్మార్ట్ కిచెన్ ల‌ను స‌మ‌ర్థించిన మంత్రి అమ‌రావ‌తి : ఆరు నూరైనా స‌రే ఎవ‌రు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్ల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. కావాల‌ని మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి…

    వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *