ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్

హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్ శ‌ర్మ‌, కుల్దీప్ యాద‌వ్, స్మృతీ మంద‌న్నా ఉన్నారు. పురుషుల విభాగంలో ఇద్ద‌రు, మహిళా విభాగంలో ఒక‌రు ఉన్నారు. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025 టోర్నీ ఛాంపియ‌న్ గా నిలిచింది భార‌త జ‌ట్టు. ఈ టోర్నీలో ప‌రుగులు చేయ‌డంలో టాప్ గా నిలిచాడు అభిషేక్ శ‌ర్మ‌. త‌ను 7 మ్యాచ్ లు ఆడి 314 ర‌న్స్ చేశాడు. ఇక బౌలింగ్ ప‌రంగా టాప్ లో నిలిచాడు 7 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు తీసి నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు కుల్దీప్ యాద‌వ్. మ‌రో వైపు పాకిస్తాన్ ఓపెన‌ర్ సిద్రా అమీన్ , ద‌క్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.

ఆసియా క‌ప్ లో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌. ఇందులో 200 స్ట్రైక్ రేట్‌తో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్మృతి మంధాన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ ఈ హై-స్టేక్స్ టోర్నమెంట్‌లో కలల పరుగును ఆస్వాదించాడు, ఇక్కడ భారతదేశం చిరకాల శత్రువులైన పాకిస్తాన్‌ను మూడుసార్లు ఓడించింది, 6.27 ఎకానమీ రేటుతో 17 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు స్పిన్న‌ర్. ఫైన‌ల్ లో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 30 ర‌న్స్ మాత్ర‌మే ఇచ్చి నాలుగు కీల‌క వికెట్లు తీశాడు. ఇక‌ స్టార్ ఇండియా టాప్-ఆర్డర్ బ్యాటర్ మంధాన, గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకుంది. మహిళల విభాగంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’కి నామినేట్ చేయబడింది.

  • Related Posts

    ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

    ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుతో వ‌న్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు గాను ఆసిస్ టీమ్ ను వేర్వేరు గా ఖ‌రారు చేసింది.…

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *