ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్
బెంగళూరు : ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషించి నటించిన చిత్రం కాంతారా చాప్టర్ 1 మూవీ. ఈ చిత్రం విడుదలై దుమ్ము రేపుతోంది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తక్కువ కాలంలోనే ఆశించిన దానికంటే అత్యధిక వసూళ్లను సాధించి రికార్డ్ సృష్టించింది. గతంలో తాను నటించిన కాంతారా ఏకంగా రూ. 400 కోట్లు వసూలు చేసింది. ఇది కూడా కన్నడ చలన చిత్ర పరిశ్రమను విస్తు పోయయేలా చేసింది. గతంలో ఇదే రంగంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ కేజీఎఫ్. భారీ ఎత్తున వసూలుఉ చేసింది ఈ మూవీ. దాని తర్వాత రిషబ్ శెట్టి కాంతారా రెండో స్థానంలో నిలిచింది. కాంతారా బిగ్ సక్సెస్ కావడంతో రిషబ్ శెట్టి దీనికి సీక్వెల్ గా ఇదే పేరుతో కాంతారా చాప్టర్ 1 పేరుతో తీశాడు. ఈ సీక్వెల్ కూడా సూపర్ గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖులు.
తాజాగా భారతీయ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్పందించాడు. రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడని పేర్కొన్నాడు. కాంతారా చాప్టర్ 1 చాలా బాగుందని ప్రశంసలు కురిపించాడు. సామాజిక వేదిక ద్వారా తన స్పందన తెలిపాడు. దీంతో తను చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో శక్తవంతంగా కథను చెప్పే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. అద్భుతమైన విజువల్స్‌తో మంత్ర ముగ్ధులను చేస్తోంది. అనేక మంది అభిమానులలో భారత క్రికెటర్ కె.ఎల్. రాహుల్ కూడా ఉన్నాడు. రిషబ్ శెట్టి తాజా కళాఖండం పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడే కాంతారా చూశాను. మళ్ళీ సృష్టించిన మాయాజాలానికి ముగ్ధుడయ్యానని తెలిపాడు. గతంలో కూడా కాంతారా మూవీని అభినందించాడు.








