యాద‌గిరిగుట్ట‌ను ద‌ర్శించుకున్న చీఫ్ జ‌స్టిస్

జ‌స్టిస్ అప‌రేష్ కుమార్ కు ఘ‌న స్వాగతం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శ‌నివారం యాద‌గిరిగుట్ట‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పూజారులు , ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, స‌భ్యులు, ఈవో ఆధ్వ‌ర్యంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు . ఆయనతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. శరత్, జస్టిస్ కె. సుజన, జస్టిస్ వి. రామకృష్ణా రెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

దర్శన ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జి. రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం, స్మారక ఫోటోలను న్యాయ మూర్తుల‌కు అందజేశారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం సీజే అప‌రేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. యాద‌గిరి గుట్ట పుణ్య క్షేత్రాన్ని ద‌ర్శించు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. స్వామి వారి కృప ప్ర‌తి ఒక్క‌రి పై ఉండాల‌ని తాను కోరుకున్నాన‌ని తెలిపారు. ఆయ‌న‌తో పాటు వ‌చ్చిన న్యాయ‌మూర్తులు సైతం ఈ ఆల‌యాన్ని అద్భుతంగా నిర్మించారంటూ కితాబు ఇచ్చారు. సాక్షాత్తు ఆ ల‌క్ష్మీ న‌రసింహుడు కొలువు తీరి ఉండ‌డం మ‌హ‌త్ భాగ్య‌మ‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *