అభివృద్దికి న‌మూనా చంద్ర‌బాబు పాల‌న‌

సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం

అమ‌రావ‌తి : దేశ రాజ‌కీయాల‌లో విల‌క్ష‌ణ‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం క‌లిగిన ఆయ‌న త‌న జీవిత కాలంలో 15 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేయ‌డం విశేషం. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆయ‌న దూర‌దృష్టి, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా నిలుస్తోంద‌న్నారు. నారా చంద్ర‌బాబు నాయుడు నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని చెప్పారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్లుగా రాజ‌కీయాల‌లో కొన‌సాగుతుండ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఆయ‌న నిరంత‌ర ప‌నిమంతుడ‌ని కితాబు ఇచ్చారు.

చంద్రబాబు నాయకత్వం వహించే ప్రతి కాలం, ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకు వస్తుందని చెప్పారు అచ్చెన్నాయుడు. ఆయనలో ఉన్న సూక్ష్మ దృష్టి, పట్టుదల, పరిపాలన నైపుణ్యం, ప్రజాసేవా తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయని కితాబు ఇచ్చారు. దేశ స్థాయిలోనూ ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం అని ప్ర‌శంసించారు. అభివృద్ధి, నూతన ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్న ఆయనకు ఈ రోజు మరొక మైలురాయి అని అన్నారు. ఆయన వంటి విజనరీ నాయకుడు మన రాష్ట్రానికి వరం అన్నారు. ఆయన పాలనలోనే ఆంధ్రప్రదేశ్ నిజమైన అర్ధంలో సుజన పాలన, స్మార్ట్ రాష్ట్రం దిశగా పయనిస్తుంది అని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *