కుల్దీప్ యాదవ్ సూపర్ షో
ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు చేసింది. దీంతో ఒత్తిడి పెంచేందుకు కెప్టెన్ శుభ్ మన్ గిల్ డిక్లేర్ చేశాడు. యంగ్ స్టార్ జైస్వాల్ 258 బంతులు ఎదుర్కొని 175 రన్స్ చేశాడు. లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. అయితే దీనిని గవాస్కర్ తప్పు పట్టాడు. ఈ నిర్ణయం అంపైర్ తప్పుగా తీసుకున్నాడని పేర్కొన్నాడు. ఇక ఆట అన్నాక ఇది మామూలే. ఇక స్కిప్పర్ శుభ్ మన్ సూపర్ షో చేశాడు. తను 129 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం మైదానంలోకి దిగింది విండీస్ .
140 పరుగులతో మొదలు పెట్టిన ఆ జట్టు ఉన్నట్టుండి భారత బౌలర్ల దెబ్బకు 248 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ 82 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయగా బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ కూల్చారు. ఆ జట్టులో అలిక్ అథనాజ్ 41 రన్స్ చేయగా షాయ్ హోప్ 36 రన్స్ తో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడాల్సి వస్తోంది విండీస్ కు. మరో వైపు 175 పరుగులతో సత్తా చాటిన యశస్వి జైస్వాల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ క్రికెటర్ , యాంకర్ సునీల్ మనోహర్ గవాస్కర్. అద్భుతంగా ఆడాడంటూ ప్రశంసలు కురిపించాడు. టన్నుల కొద్దీ పరుగులు చేయాలని ఆకాంక్షించాడు.








