న‌గేష్ మృతిపై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ సీరియ‌స్

బానోతు అనుమానాస్ప‌ద మృతి పై ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల‌) క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైద‌రాబాద్ లోని
మియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో బానోత్ న‌గేష్ అనే విద్యార్థి అనుమానాస్ప‌ద మృతిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్బంగా మండిప‌డింది. ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావ‌ట్ క‌ళ్యాణి ఎస్టీ క‌మిష‌న్ కు విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తీవ్రంగా స్పందించింది ఎస్టీ క‌మిష‌న్. అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన బానోతు న‌గేష్ స్వ‌స్థ‌లం ఖ‌మ్మం జిల‌ల్లా యోనెకుంట తాండా.

ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని ఆదేశించింది సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ను. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 7వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయ్యింది. బానోతు న‌గేష్ మృతిపై 15 రోజుల లోపు కేసు పురోగ‌తి, చ‌ర్య‌ల వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది ఎస్టీ క‌మిష‌న్. ఒకవేళ నిర్దేశించిన స‌మ‌యం లోపు స‌మాధానం ఇవ్వ‌క పోతే , సివిల్ కోర్టు అధికారుల‌తో స‌మ‌న్లు జారీ చేయాల్సి ఉంటుంద‌ని సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ ను హెచ్చ‌రించింది జాతీయ ఎస్టీ క‌మిష‌న్.

Related Posts

తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *