ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ

Spread the love

రిజ‌ర్వేష‌న్ల‌లు అమ‌లు చేసేంత దాకా పోరాటం ఆగ‌దు

హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ శ‌నివారం ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలో బీసీ విద్యార్థులు క‌దం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుండి తార్నాక చౌరస్తా వరకు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు . ఈ ర్యాలీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో BC జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాల‌ని డిమాంండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి అనే విలువలపై ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వం BC వర్గాలకు అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున బీసీ బంద్ కు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ చైర్మ‌న్ బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణ‌య్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని , అమ‌లు చేసేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రాజ‌కీయాలు చేయ‌డం మానుకుని అమ‌లుపై ఫోక‌స్ పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    ప్ర‌తి ప‌ల్లెకు స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందిస్తాం

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ వెల్ల‌డి అమ‌రావ‌తి : ఏపీలోని ప్ర‌తి పల్లెతో పాటు తాండాలో స్వ‌చ్ఛ‌మైన‌, శుద్ద‌మైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామ‌న్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్రాభివృద్ధికి కీలకమైన మౌలిక…

    ఉన్న పిల్ల‌ల‌కే దిక్కు లేదు..ముగ్గుర్ని క‌న‌మంటే ఎలా..?

    Spread the love

    Spread the loveఏపీ కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పాపులేష‌న్ గురించి చేసిన కామెంట్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *