ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ

రిజ‌ర్వేష‌న్ల‌లు అమ‌లు చేసేంత దాకా పోరాటం ఆగ‌దు

హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ శ‌నివారం ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలో బీసీ విద్యార్థులు క‌దం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ఎత్తున ర్యాలీ చేప‌ట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుండి తార్నాక చౌరస్తా వరకు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు . ఈ ర్యాలీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో BC జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగాలు, రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాల‌ని డిమాంండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి అనే విలువలపై ఆధారపడి ఉందని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వం BC వర్గాలకు అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలన్న తమ వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున బీసీ బంద్ కు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ చైర్మ‌న్ బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణ‌య్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని , అమ‌లు చేసేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రాజ‌కీయాలు చేయ‌డం మానుకుని అమ‌లుపై ఫోక‌స్ పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి : ఈట‌ల రాజేంద‌ర్

    సికింద్రాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) జిల్లా పార్టీ కార్యాలయంలో కీలక నాయకులు,…

    అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భార‌త్

    విజ‌య‌వాడ : ఒక దశాబ్దంలోనే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే అవ‌కాశం ఉంద‌న్నారు మంత్రి నారా లోకేష్‌. విజయవాడలో జరిగిన ‘పాన్-ఐఐటీ (Pan-IIT) ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026’లో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వ్యూహం ‘3S’ మంత్రం – అంటే వేగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *