కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన కీలక ప్రకటన చేశారు. దీపావళి పండుగ సందర్బంగా ఆయన కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మేరకు తను తీస్తున్న పెద్ది మూవీ గురించి ప్రస్తావించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో పెద్ది మూవీని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ దీనిని సమర్పిస్తున్నారు. పెద్ది మూవీలో రామ్ చరణ్ తేజ తో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాహ్నవి కపూర్ కీలక పాత్రలు పోషించారు. పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ , టీజర్ , సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
వచ్చే ఏడాది 2026లో విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు బుచ్చిబాబు సన. శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా పెద్దిని గ్రాండ్ గా విడుదల చేస్తామని ప్రకటించారు. గతంలో మార్చి 27న రిలీజ్ చేద్దామని అనుకున్నామని, కానీ ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున శ్రీరామ నవమి పండుగ రోజు విడుదల చేయాలని కోరారని ఆ మేరకు దీనినే ఫైనల్ చేసినట్లు తెలిపారు బుచ్చిబాబు సన. పెద్ది చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దినట్లు చెప్పారు దర్శకుడు. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ సంగీతం అందించారు. ఇదిలా ఉండగా చిత్రం షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయిందన్నారు. ఇందులో శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.








