సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అంటూ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో ఉండడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తను ఏ పార్టీలో గెలిచాడు..ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడని ప్రశ్నించాడు. మా పార్టీలో గెలిచినోళ్లను తీసుకొని, వాళ్ల పార్టీ క్యాంపెయినర్ల లిస్ట్‌లో పెట్టారంటూ ఎద్దేవా చేశారు. స్పీకర్ దగ్గరేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకుని ఇలాంటి చిల్లర పనులు చేస్తుందంటూ ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు ప్రజా ప్రతినిధులుగా గెలుపొందారా ఒక్కసారైనా ఆలోచించారా అని ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే ల గురించి నిలదీశారు కేటీఆర్. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందన్నారు. అర చేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు పట్టించు కోక పోవడం దారుణమన్నారు. మరో వైపు హైడ్రా పేరుతో నానా యాగీ చేస్తూ బడా బాబులకు వత్తాసు పలుకుతూ పేదలు, సామాన్యులను నడ్డి విరుస్తున్నారంటూ ఆరోపించారు.






