పోలీసుల జోలికి వస్తే తాట తీస్తామని వార్నింగ్
అనంతపురం జిల్లా : తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఎస్పీ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ ఏఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి . తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు ఏఎస్పీ. తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు బయటికి రావాలంటే ఎస్ఐ, కానిస్టేబుల్ కావాలని అన్నారు. రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా పనికిరాడని సంచలన ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో నువ్వు వచ్చాక నేరాలకు సంబంధించి రేట్ తగ్గలేదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గిందంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఇప్పటికే కోల్డ్ వార్ కొనసాగుతోంది. మరో వైపు అధికారంలో ఉంటూ ఇలా లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించే పోలీసుల పట్ల నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుతం జేసీ ఏఎస్పీని లక్ష్యంగా చేసుకోవడం, సంచలన ఆరోపణలు చేయడం, పనికి రావంటూ పేర్కొనడం పట్ల పోలీసులు భగ్గుమంటున్నారు.






