ఏపీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

Spread the love

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ . ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది అల్పపీడనం అని తెలిపారు. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు ఎండీ. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. దక్షిణ కోస్తా,రాయలసీమకు భారీవర్ష సూచన చేశారు.
అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101ను సంప్ర‌దించాల‌ని సూచించాచ‌రు.

తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌న్నారు. ఎవ‌రూ కూడా చెట్ల కింద‌, శిథిల భ‌వ‌నాల వ‌ద్ద నిల‌బ‌డ‌రాద‌ని సూచించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు. ప‌లు జిల్లాల‌లో ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని కోరారు. దీంతో రాష్ట్ర ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే త‌ప్పా మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల రాద‌ని సూచించారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

  • Related Posts

    తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష త‌గ‌దు

    Spread the love

    Spread the loveభ‌గ్గుమ‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం స‌వ‌తిత‌ల్లి ప్రేమ క‌న‌బ‌రుస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. గ‌త 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ…

    వ‌డగాల్పుల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : ఎండా కాలం ప్రారంభ‌మైంద‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *