మెంథా తుపాను ఎఫెక్ట్ ప‌లు జిల్లాల‌కు సెల‌వులు

Spread the love

విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్

అమ‌రావ‌తి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఒకటి నుండి ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవులలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.కృష్ణా జిల్లాలో 27, 28, 29 వ తేదీల‌లో మూడు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజులు సెల‌వు ఇచ్చారు. అన్నమయ్య జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. క‌డ‌ప జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజుల పాటు సెల‌వులు ఇచ్చారు.

బాపట్ల జిల్లాలో 27, 28, 29వ తేదీల‌లో మూడు రోజుల పాటు సెల‌వులు ఇస్తున్న‌ట్లు తెలిపారు. గుంటూరు జిల్లా 27, 28, 29 మూడు రోజులు ఇవ్వ‌గా అనకాపల్లి జిల్లాలో 27,28,29 వ తేదీల‌లో మూడు రోజులు సెల‌వులు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో 27, 28, 29, 30, 31వ తేదీల‌లో ఐదు రోజుల పాటు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఏలూరు జిల్లాలో 27, 28వ తేదీల‌లో రెండు రోజులు సెల‌వులు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో 27న ఒక్క రోజు సెల‌వు ప్ర‌క‌టించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 28, 29 వ తేదీల‌లో రెండు రోజుల పాటు సెల‌వులు ఇచ్చారు.

  • Related Posts

    ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూప‌ర్ : సీఎం

    Spread the love

    Spread the loveఅర‌కు కౌని రూపొందించ‌డం అభినంద‌నీయం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూను ఆవిష్క‌రించారు .అరకు కౌని’ పేరుతో రూపొందించినందుకు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో…

    జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆదేశించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *