మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి

అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీని కార‌ణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వ‌ర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి. ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ ను ప్ర‌క‌టించింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఇందులో భాగంగా అప్ర‌మ‌త్తం చేసే ప‌నిలో ప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం ఆయ‌న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కీల‌క స‌మావేశానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రులు నారా లోకేష్‌, అనిత‌, నారాయ‌ణ‌, నిమ్మ‌ల‌తో పాటు చీఫ్ సెక్ర‌ట‌రీ విజ‌యానంద్ కూడా హాజ‌ర‌య్యారు. ఉన్న‌తాధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు.

కాఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 650 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఇక బాపట్లలో 481 , తూర్పు గోదావ‌రి జిల్లాలో 376 కేంద్రాల‌ను అత్య‌థికంగా ఏర్పాటు చేశామ‌న్నారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మాట్లాడుతూ, దక్షిణ రాష్ట్రంలోని తీరప్రాంతమైన శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అవసరమైతే, కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కాపులుప్పాడలో 125 మి.మీ., విశాఖపట్నం గ్రామీణంలో 120 మి.మీ., ఆనందపురంలో 117 మి.మీ. వర్షపాతం నమోదైందని జైన్ తెలిపారు. విశాఖపట్నంలో 52 మి.మీ., కాకినాడలో 21 మి.మీ., నరసాపూర్‌లో 18 మి.మీ., ఆరోగ్యవరంలో 15 మి.మీ., తునిలో 12 మి.మీ., మచిలీపట్నంలో 12 మి.మీ., నెల్లూరులో 11 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *