స‌హాయ‌క చ‌ర్య‌లపై సీఎం స‌మీక్ష

Spread the love

ఆందోళ‌న చెంద‌వద్ద‌ని సూచ‌న

అమ‌రావ‌తి : ఏపీలో వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను దెబ్బ‌కు గంట‌కు 90 నుంచి 100 కిలోమీట‌ర్ల మేర ఈదురుగాలులు వీస్తున్నాయి. ముంద‌స్తుగా విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైంది ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న రాత్రి అత్య‌వ‌స‌రంగా స‌మీక్ష చేప‌ట్టారు ఉన్న‌తాధికారుల‌తో. ఈ స‌మీక్ష‌లో మంత్రులు నారా లోకేష్‌, అనిత వంగ‌ల‌పూడి, నారాయ‌ణ‌, నిమ్మ‌ల రామా నాయుడు ద‌గ్గ‌రుండి స‌హాయ‌క చ‌ర్య‌లు ఎలా ఉన్నాయో ప‌రిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా మరోసారి తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్‌లో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్ తో పాటు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి తుఫాను తీవ్రత పెరగనన్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాలు, గ్రామాల‌లో ప్ర‌జ‌ల‌ను దీని ద్వారా అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే పనిలో ప‌డ్డారు.

  • Related Posts

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం…

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *