కనీస సౌకర్యాల కల్పనపై ఆరా
వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాటలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, కళాకారులు, ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ను నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో పండించిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన చెందారు. వారికి కనీస మద్దతు ధర లభించడం లేదంటూ వాపోయారు. ధాన్యం తడిసినా సరే ఎఫ్ సీ ఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే క్రమంలో మంగళవారం జాగృతి జనంబాటలో భాగంగా దేవరకొండ మండలం కొమ్మేపల్లిలో తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా విద్యార్థులతో తరగతి గదిలో కూర్చుని ముచ్చటించారు. పాఠశాలలో పరిస్థితులు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కనీస వసతి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పట్టించు కోక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.






