newsseals.com
News

ఏపీ, తెలంగాణ‌కు చెందిన నిందితుల‌పై ఛార్జిషీట్

VijayaBhaskar November 11, 2025
newsseals-NIAArrest
Spread the love

అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

అమ‌రావ‌తి / తెలంగాణ : జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉగ్ర‌వాదుల‌తో స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్న ఇద్ద‌రు నిందితుల‌ను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్ద‌రూ తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఏపీ రాష్ట్రంలోని విజ‌యన‌గ‌రంకు చెందిన సిరాజ్ ఉర్ ర‌హ‌మాన్, తెలంగాణ‌లోని హైద‌రాబాద్ కు చెందిన స‌య్య‌ద్ స‌మీర్ ల‌ను గుర్తించింది. ఇవాళ అదుపులోకి తీసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఏపీ, తెలంగాణ ఉగ్ర‌వాద కుట్ర కేసులో ఇద్ద‌రు నిందితుల‌పై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ ఇద్ద‌రినీ మే 16, 17వ తేదీల‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్ప‌టికే.

విశాఖపట్నంలోని NIA ప్రత్యేక కోర్టు ముందు వారిపై దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ లో కీల‌క అంశాలు వెల్ల‌డించారు. ఈ ఇద్ద‌రూ దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఉగ్రవాద దాడులు చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారతదేశం అంతటా మోసపూరిత కుట్ర‌కు తెర లేపారు. అంతే కాకుండా యువతను తీవ్రవాదం వైపు మొగ్గు చూపేలా చేశార‌ని ఆరోపించింది ఎన్ఏఐ. తెలంగాణలో 3 ఉగ్రవాద కేసుల్లో భాగంగా సిరాజ్ ఉర్ రహిమాన్ , సయ్యద్ సమీర్ ఇద్దరిపై BNS, పేలుడు పదార్థాల చట్టం మరియు UA (P) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.