బీసీల హ‌క్కుల కోసం పోరాటానికి సిద్దం

Spread the love

ప్ర‌క‌టించిన బీసీవై పార్టీ చీఫ్ రామ‌చంద్ర యాద‌వ్

అమ‌రావ‌తి : ఏపీలో బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. మంగళ‌గిరిలో నిర్వ‌హించిన కార్తీక వ‌న మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హజ‌రై ప్ర‌సంగించారు. ప్రతి కులానికి వారి సంస్కృతిని, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఆత్మగౌరవ భవనాలు, సాంస్కృతిక భవనాలు, మన యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య శిక్షణా కేంద్రాలు ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తాము అడుగుతున్న డిమాండ్ కాదు, ఇది బీసీల హక్కు అని రామచంద్ర యాదవ్ ఉద్ఘాటించారు. ఏపీలో అన్ని బీసీల‌కు చెందిన అన్ని కులాల వారికి స‌రైన గుర్తింపు లేద‌న్నారు. అన్ని పార్టీలు బీసీల‌ను ఓటు బ్యాంకుగా చూస్తున్నాయ‌ని ఆరోపించారు.

ఈ అన్యాయాన్ని ఇక చూస్తూ ఊరుకోమంటూ హెచ్చ‌రించారు బోడె రామ‌చంద్ర యాదవ్. బీసీల హక్కుల సాధన కోసం, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, త్వరలోనే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో, అన్ని బీసీ కుల సంఘాలు, మేధావులు, పెద్దలతో రాష్ట్ర స్థాయిలో ఒక భారీ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామ‌న్నారు. భవిష్యత్ పోరాట కార్యాచరణను ప్రకటిస్తామ‌ని తెలిపారు. ఇది కేవలం ఒక పార్టీ పోరాటం కాదు, ఇది బీసీలందరి ఉమ్మడి పోరాటం అని స్ప‌ష్టం చేశారు. ఈ పోరాటానికి బీసీలంతా ఏకమై, అండగా నిలవాల‌ని పిలుపునిచ్చారు రామ‌చంద్ర యాద‌వ్. మీ అందరి పక్షాన, ముందుండి ఈ యుద్ధాన్ని నడిపించే బాధ్యత తాను తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

  • Related Posts

    కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై క‌న్నేసిన సీఎం

    Spread the love

    Spread the loveఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక త‌ను అస‌లు రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని అన్నారు. ప్ర‌జా…

    నీటిని నిల్వ చేయాలి జ‌లాశ‌యాలు నింపాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురం జిల్లా : స‌మ‌స్త మాన‌వాళికి నీరు అత్యంత ముఖ్య‌మ‌ని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం అనంత‌పురం జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *