నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త : సీఎం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు నాయుడు

పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా జీవితం ఎంద‌రికో స్పూర్తిని క‌లిగిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవ‌తోనే జీవితానికి సార్థ‌క‌త ల‌భిస్తుంద‌ని చెప్పారు. పుట్టప‌ర్తిలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉందన్నారు. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశం 10వ స్థానం నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పారు. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం అన్నారు సీఎం. దీనిని సాధించడానికి మనం భవిష్యత్తు రంగాలు అయిన AI-డేటా సెంటర్లు, క్వాంటం, ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్షం, సెమీకండక్టర్, రక్షణ రంగాలలోని పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. దేశంలో ఉన్న అన్ని ఫ్యూచర్ టెక్నాలజీలను ఏపీకి తెస్తున్నామ‌ని చెప్పారు.

సీఐఐ సదస్సులో రూ. 13.25 లక్షల పెట్టుబడులు తెచ్చామన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 16 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గూగుల్ పెట్టనుందన్నారు. వినూత్న ఆలోచనలకు ఆర్టీఐహెచ్ వేదిక. కొత్త ఆలోచనలతో వచ్చిన వారితో కంపెనీలు పెట్టించేలా చూస్తున్నామ‌న్నారు. ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూర్, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఏఐ టెక్నిషీయన్ అనే సిద్దాంతంతో పని చేస్తున్నట్లు తెలిపారు సీఎం. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నమ‌ని అన్నారు. నైపుణ్యమున్న యువతదే అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర. విద్యార్థులు, యువతే దేశానికి సంరక్షకులు అని చెప్పారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *