విద్యార్థులే స‌త్య‌సాయి బాబాకు బ్రాండ్ అంబాసిడ‌ర్లు

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్

శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌పర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్. మన కోసం మనం బతకడంతో పాటు ఇతరుల గురించి బతకడమనేది ఉత్తమ విధానం అన్నారు. ఈ ఆధునిక విధానాలను ప్ర‌తి ఒక్క‌రు పాటించాల‌ని సూచించారు. సంప్రదాయాలను పాటించాలి. సత్యసాయి బాబా సిద్దాంతాలు.. సూత్రాలే నిజమైన విద్య అని అన్నారు. ప్రపంచం చెప్పేది భారత దేశం వింటోందనేది పాత మాట భారత దేశం చెప్పేది ప్రపంచం వింటోందనేది కొత్త మాట అని అన్నారు ఉప రాష్ట్ర‌ప‌తి. దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర కీలకమైనదని చెప్పారు. రీసెర్చ్ రంగానికి ఎక్కువ నిధులు వినియోగించాలని కోరారు. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

కోవిడ్ కు టీకాలను కనుగొంది మన భారత దేశమే. దీన్ని మన దేశంతో పాటు వివిధ దేశాలకు ఫ్రీగా ఇవ్వడమనేది నరేంద్ర మోదీ అచీవ్మెంట్. కోవిడ్ టీకాలను 100కు పైగా దేశాలకు పంపిణీ చేశారు. అందుకే ఓ దేశాధ్యక్షుడే మోదీ పాదాలకు నమస్కరించారని అన్నారు. భారత మాత శక్తిమంతమైనదే కాదు… దయగలిగినది కూడా. దయతో లేకుంటే ఎంత శక్తి ఉన్నా నిరర్థకమేన‌ని అన్నారు సీపీ రాధాకృష్ణ‌న్. కొన్ని విదేశాల్లో కూడా టీకాలు తయారు చేశారు. కానీ వారు 7500 డాలర్లకు అమ్మాలని భావించారు. ప్రధాని మోదీ ఏనాడూ కోవిడ్ టీకాలను అమ్మాలని అనుకోలేదని అన్నారు. అందుకే ప్రధాని మోదీ ఇవాళ గ్లోబల్ లీడర్ గా ఎదిగారని కొనియాడారు. డ్రగ్స్ ఇప్పుడు అతి పెద్ద సవాలుగా మారింది… నో టూ డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు ఉప రాష్ట్ర‌ప‌తి.

  • Related Posts

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

    Spread the love

    Spread the loveస్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు.…

    మ‌య‌న్మార్ అధ్య‌క్షుడితో పీఎం మోదీ భేటీ

    Spread the love

    Spread the loveప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్‌లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా భారత, మయన్మార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *