29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివ‌స్

నిర్వ‌హంచాల‌ని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన ఆనాటి తెలంగాణ వ‌చ్చుడో కేసీఆర్ స‌చ్చుడో పిలుపు వ‌ల్ల‌నే నూత‌న రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు. అందుకే ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ 29వ తేదీన దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నామ‌న్నారు. శ‌నివారం పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు కేటీఆర్. ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. ఈనెల 26న స‌న్నాహ‌క స‌మావేశాల‌ను ఆయా జిల్లా కేంద్రాల‌లో నిర్వహించాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించాల‌ని అన్నారు కేటీఆర్.

నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలని స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా అంటే 28వ తేదీ సాయంత్రం లోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాల‌న్నారు. పార్టీ కార్యాలయం ప్రాంగణాన్ని కూడా సుందరంగా అలంకరించాలని సూచించారు కేటీఆర్. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా సమాచారం అందించాల‌ని, కనీసం 1000 మంది కీలక పార్టీ నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మొదటగా తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన తర్వాత, కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కెసిఆర్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలన్నారు.

దీక్షా దివస్ సందర్భంగా జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు కేటీఆర్. కేవలం రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్ సూచించారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *