ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

Spread the love

పంచ‌మి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ

తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వహించే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. పుణ్య స్నానం చేయ‌నున్నారు. దీంతో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఎస్వో, ఎస్పీలు ప‌రిశీలించారు.
భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం, పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, భక్తుల వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల హోల్డింగ్ పాయింట్ల నుండి పుష్కరిణి వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలిస్తూ, క్యూ పాయింట్ల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు.

పంచమి తీర్థం పుణ్య ఘడియలు ఆ రోజంతా కొనసాగనున్నందున భక్తులు ఆత్రుత చెందకుండా, పోలీసులకు సహకరిస్తూ నెమ్మదిగా పుణ్యస్నానం ఆచరించాలని భక్తులందరికీ కడపటి భక్తుడు వరకు కూడా పుణ్యస్నానం ఆచరించే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశామని, ఇంకా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

25న జ‌రిగే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున వాహ‌నాలు రానున్నాయ‌ని తెలిపారు. వడమాలపేట , అప్పలయగుంట వైపు నుండి తిరుచానూరు/ తిరుపతి వైపు వచ్చే వాహనాలు పూడి రైల్వే గేటు–ఆర్‌సి పురం–తిరుచానూరు మార్గం గుండా తిరుపతి వైపు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే పుత్తూరు, శ్రీ కాళహస్తి వైపు నుండి తిరుపతి చేరుకునే వాహనాలు గాజులమండ్యం సర్కిల్–ఓల్డ్ రేణిగుంట రోడ్–రేణిగుంట టౌన్–ఆటో నగర్–బ్లిస్ హోటల్ మార్గం ద్వారా తిరుపతి వైపు వెళ్లాలని సూచించారు.

తిరుపతి టౌన్ నుండి తిరుచానూరుకు వెళ్లే ఆర్‌టీసీ టౌన్ సర్వీసులు, ప్రైవేట్ బస్సులు తిరుపతి–మ్యాంగో యార్డ్–తనపల్లి క్రాస్–సిఎస్ కళ్యాణమండపం–సర్వీస్ రోడ్–ఒరియన్ హోటల్–తాటి బెల్లం హోటల్–మ్యాంగో మార్కెట్ యార్డ్ మార్గం గుండా తిరిగి తిరుపతి వైపు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. చిత్తూరు వైపు నుండి తిరుపతి చేరుకునే ఆర్‌టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఒమేగా హాస్పిటల్–చెర్లపల్లి జంక్షన్ మార్గం ద్వారా తిరుపతి వైపు ప్రవేశించాలి. తిరుపతి నుండి తిరుచానూరుకు వెళ్లే ద్విచక్ర వాహనాలు శిల్పారామం వద్ద పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కార్లు మరియు ఇతర వాహనాలు మ్యాంగో మార్కెట్ యార్డ్ పార్కింగ్ ప్రాంతాన్ని వినియోగించాల్సి ఉంటుంది. శ్రీ పద్మావతి అమ్మవారి పడి వాహనాలు మాత్రమే తనపల్లి క్రాస్–సింధు ఫ్లైఓవర్–వార్తక్రాస్–రంగనాధం వీధి మార్గం ద్వారా అమ్మవారి ఆలయానికి అనుమతించ బడతాయని తెలిపారు ఎస్పీ.

  • Related Posts

    స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ చెంత‌న సీఎం రేవంత్ రెడ్డి

    Spread the love

    Spread the loveత‌న జీవితంలో మ‌రిచి పోలేని రోజు అన్న అనుముల‌ ములుగు జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద మేడారం జాత‌ర‌కు జ‌నం పోటెత్తారు. ఈ సంద‌ర్బంగా సోమ‌వారం ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిలిచారు. మేడారం…

    వ‌న‌ దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

    Spread the love

    Spread the loveమొక్కులు చెల్లించుకున్న రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వ‌రంగ‌ల్ జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద జాత‌ర మేడారం జ‌న‌సంద్రంగా మారింది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తండోప తండాలుగా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *