అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ


రాజధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాం

అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు కీల‌క క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో త‌న‌తో పాటు కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఉన్నార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌మావేశం కావ‌డం జ‌రిగింద‌న్నారు. రాజ‌ధాని నిర్మాణం కోసం స్వ‌చ్చంధంగా త‌మ భూములు ఇచ్చిన రైతుల‌కు న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. చాలా మంది రైతుల‌కు ఇప్ప‌టికే ప‌రిహారం అంద‌జేశామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా సమస్యలు మా దృష్టికి రాగానే అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. గ్రామ కంఠాల్లో కొందరికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని, దీనిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెడ‌తామ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్‌ భూములపై అధ్యయనానికి రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారని వెల్ల‌డించారు. ఇందులో తాను కూడా సభ్యుడిగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు పొంగూరు నారాయ‌ణ‌. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై అసైన్డ్‌ భూములపై చర్చించాం అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *